MLA Sanjay Kumar: ప్రమాదవశాత్తు గాయపడిన కరోనా రోగి బాధను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే మళ్లీ డాక్టర్ కోటును ధరించారు. ఏ మాత్రం ఆలోచించకుండా కరోనా రోగికి వైద్యం అందించారు. దీంతో ఆయనను ప్రశంసిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సైతం ఆ ఎమ్మెల్యేను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన ఓ గీత కార్మికుడు ఇటీవల ఇంట్లో జారిపడ్డాడు. దీంతో తలకు బలమైన గాయమై కన్నుకు తీవ్ర గాయమైంది. కుడి కాలు కూడా విరిగింది. చికిత్స కోసం కరీంనగర్‌లోని పలు ఆసుపత్రులకు వెళ్లారు. ఈ క్రమంలోనే అతడికి కరోనా సోకింది. పాజిటివ్‌గా తేలడంతో చికిత్స చేసేందుకు అక్కడి వైద్యులు నిరాకరించారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాడు. అయితే తీవ్రమైన నొప్పితో అతడు బాధపడుతుండగా.. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వెంటనే స్పందించారు. కంటి వైద్యుడైన ఎమ్మెల్యే సంజయ్, మరో ఆర్థోపెడిక్ వైద్యుడి సాయంతో పీపీఈ కిట్‌లు ధరించి కరోనా బాధితుడికి ఆదివారం చికిత్స అందించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించగా.. మంత్రి కేటీఆర్ సంజయ్‌పై ప్రశంసలు కురిపించారు.
Read More:
ఏపీలో వారంలోపే బియ్యం కార్డుల్లో పేర్లు
సొంత బ్యాంక్ ఏర్పాటు చేయనున్న నిత్యానంద
Good Job MLA Dr. Sanjay Kumar Garu ?? https://t.co/k4Nk1QHbly
— KTR (@KTRTRS) August 16, 2020