ఏపీలో ఆలయంకు సీఎం కేసీఆర్ విరాళం

ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడు పేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్

ఏపీలో ఆలయంకు సీఎం కేసీఆర్ విరాళం

Edited By:

Updated on: Aug 30, 2020 | 10:26 AM

KCR donates money: ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడు పేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్, సతీమణి శోభ దంపతులు విరాళం ఇచ్చారు. ఆలయ ముందు భాగంలో మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి వారు విరాళాలు ఇచ్చారు. కాగా శనివారం ఈ ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ, కుంబాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా వారు హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులు కేసీఆర్ పేరిట శిలాఫలకం ఆవిష్కరించారు.

Read More:

పులివెందుల ఎస్సైని ఢీకొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్‌

జగన్‌ ఆదేశాలు.. విధుల్లోకి సింహాచలం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది