ఈ నెల 18న కనక దుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం

| Edited By:

Sep 04, 2020 | 10:21 PM

విజయవాడలో దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న కనక దుర్గ ఫ్లైఓవర్‌ని ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది

ఈ నెల 18న కనక దుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
Follow us on

Kanaka Durga Flyover: విజయవాడలో దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న కనక దుర్గ ఫ్లైఓవర్‌ని ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంయుక్తంగా ఈ వంతెనను ప్రారంభించబోతున్నారు. ‌ ఇక క‌రోనా నేప‌థ్యంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా‌ కేంద్రమంత్రి గడ్కరీ  పాల్గొన‌నున్నారు.

ఇక అదే రోజు రూ. 7,584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు 887 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి ఈ ఇద్దరు శంకుస్థాపనలు చేయనున్నారు.  రూ. 8,083 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీతో క‌లిసి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అయితే ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి మొదట ఈ నెల 4న ముహూర్తం ఖరారు చేశారు. కానీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడంతో.. ప్రభుత్వం సంతాప దినాలను ప్రకటించడంతో.. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడిన విషయం తెలిసిందే.

Read More:

సుశాంత్ కేసు: రియా సోదరుడు అరెస్ట్‌.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

రుణం తీసుకునేందుకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కి‌ అనుమతి