బందర్ తీరంలో శ్రీలంక బోటు హల్‌చల్!

|

Jul 13, 2020 | 3:59 PM

ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో శ్రీలంక బోటు కలకలం రేపింది. భారత సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిన శ్రీలంక బోటును గమనించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

బందర్ తీరంలో శ్రీలంక బోటు హల్‌చల్!
Follow us on

ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో శ్రీలంక బోటు కలకలం రేపింది. భారత సముద్ర జలాల్లోకి దూసుకొచ్చిన శ్రీలంక బోటును గమనించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మచిలీపట్నం తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఆ బోటును పట్టుకున్న సిబ్బంది దానిని కాకినాడ తరలించారు. చేపల వేట కోసం కేజీ బేసిన్ పరిధి వరకు ఇందువర ఫిషింగ్ బోట్ వచ్చేసింది. భారత కోస్ట్ గార్డ్ బృందాన్ని చూసి పరారయ్యేందుకు ప్రయత్నించిన ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆ మత్స్యకారుల నుంచి భారీ టునా చేపను స్వాధీనం చేసుకున్నారు. అయితే, టునా చేపల ప్రత్యుత్పత్తికి ఇది సీజన్ అంటున్నారు మత్స్యకారులు. అయితే, ఈ సీజన్‌లో వాటిని పట్టుకోకూడదని నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని కోస్ట్‌గార్డ్‌ అధికారు వెల్లడించారు. బోటులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్న కోస్ట్ గార్డు సిబ్బంది విచారిస్తున్నట్లుగా తెలిపారు.