కిడ్నాపర్లు నాకు తెలుసు: బాలుడు జషిత్

కిడ్నాపర్లు తనను కిడ్నాప్ చేసి వేరే ఊరికి తీసుకెళ్లారని చిన్నారి జషిత్ తెలిపాడు. ఒక వ్యక్తి ఇంట్లో తనను వదిలేశారని.. రోజూ తనకు ఉదయం ఇడ్లీనే తినిపించారని.. మధ్యాహ్నం పెరుగన్నం పెట్టారని చెప్పుకొచ్చాడు. కిడ్నాప్ చేసిన వారిలో రాజు అనే వ్యక్తి తనకు తెలుసని చెప్పాడు. రాజునే తనను కారులో తీసుకొచ్చి రోడ్డుపై వదిలేశాడని పేర్కొన్నాడు. అయితే నాలుగు రోజుల క్రితం జషిత్ మండపేటలో కిడ్నాప్‌కు గురయ్యాడు. అతడు సురక్షితంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులతో పాటు […]

కిడ్నాపర్లు నాకు తెలుసు: బాలుడు జషిత్

Updated on: Jul 25, 2019 | 8:40 AM

కిడ్నాపర్లు తనను కిడ్నాప్ చేసి వేరే ఊరికి తీసుకెళ్లారని చిన్నారి జషిత్ తెలిపాడు. ఒక వ్యక్తి ఇంట్లో తనను వదిలేశారని.. రోజూ తనకు ఉదయం ఇడ్లీనే తినిపించారని.. మధ్యాహ్నం పెరుగన్నం పెట్టారని చెప్పుకొచ్చాడు. కిడ్నాప్ చేసిన వారిలో రాజు అనే వ్యక్తి తనకు తెలుసని చెప్పాడు. రాజునే తనను కారులో తీసుకొచ్చి రోడ్డుపై వదిలేశాడని పేర్కొన్నాడు. అయితే నాలుగు రోజుల క్రితం జషిత్ మండపేటలో కిడ్నాప్‌కు గురయ్యాడు. అతడు సురక్షితంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం జషిత్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us