విజయవాడలో భారీ వర్షం.. డేంజర్ జోన్‌లో..!

| Edited By: Pardhasaradhi Peri

Aug 17, 2019 | 9:30 AM

విజయవాడలో ఈ రోజు ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెల్లవారుజామునుంచీ ఎడతెరిపిలేని వర్షం రాకతో.. స్థానికంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని వర్షాలతో.. బ్యారేజీలన్నీ జలకళ సంతరించుకున్నాయి. కృష్ణా జిల్లాలోని కరకట్టకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే.. ఇంటినుంచి బయటకు రాకుండా.. వర్షాలు గ్రామాలను ముంచెత్తాయి. అటు.. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా.. భారీగా వరద నీరు చేరుతోంది. దాదాపు.. 8 లక్షల క్యూసెక్కుల […]

విజయవాడలో భారీ వర్షం.. డేంజర్ జోన్‌లో..!
Follow us on

విజయవాడలో ఈ రోజు ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెల్లవారుజామునుంచీ ఎడతెరిపిలేని వర్షం రాకతో.. స్థానికంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని వర్షాలతో.. బ్యారేజీలన్నీ జలకళ సంతరించుకున్నాయి. కృష్ణా జిల్లాలోని కరకట్టకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే.. ఇంటినుంచి బయటకు రాకుండా.. వర్షాలు గ్రామాలను ముంచెత్తాయి. అటు.. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా.. భారీగా వరద నీరు చేరుతోంది. దాదాపు.. 8 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో.. లంక గ్రామాలు గజగజ వణుకుతున్నారు. వరద ప్రవాహం ఎక్కువకాడంతో.. నీటిని సముద్రానికి మళ్లిస్తున్నారు.

కాగా.. ఏపీ మంత్రి అనిల్ కుమార్ ఇప్పటికే.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు మంత్రి అనిల్.