Vizag: గోవా నుంచి విశాఖ వచ్చిన యువకులు.. రైల్వే స్టేషన్‌లో హడావిడి.. అనుమానంతో చెక్ చేయగా

|

Aug 07, 2022 | 1:28 PM

స్నేహితుల దినోత్సవం రోజున విశాఖకు పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చే అవకాశం ఉందని విశాఖ పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులుకు ఓ హైటెక్ గ్యాంగ్ చిక్కింది.

Vizag: గోవా నుంచి విశాఖ వచ్చిన యువకులు.. రైల్వే స్టేషన్‌లో హడావిడి.. అనుమానంతో చెక్ చేయగా
Vizag Railway Station
Follow us on

AP News: ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను విశాఖపట్నం సిటీ పోలీసులు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 50 బ్లాట్స్ LSD, 5 గ్రాముల MDMAను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి గంజాయి సేకరించి ఈ ముఠా దాన్ని గోవా(Goa)కు తీసుకెళ్లి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అదే విధంగా గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి స్థానికంగా అమ్ముతున్నట్టు తెలిసింది. ఈ ముఠా గత కొంతకాలంగా ఈ ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు విశాఖ కమిషనర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. ఈ ముఠాలోని సభ్యులందరూ గతంలోనూ డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డారని పోలీసులు వివరించారు. ఈ గ్యాంగ్ డార్క్‌ నెట్‌ ఉపయోగిస్తూ క్రిప్టో కరెన్సీ(crypto currency) ద్వారా లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో11 మందికి సంబంధించిన వివరాలు గతంలోనే గుర్తించామని వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా టెక్నాలజీ ఉపయోగిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నారని విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. డ్రగ్స్‌ వినియోగం, విక్రయాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు  చెప్పారు.

మరిన్ని ఏపీవార్తల కోసం క్లిక్ చేయండి..