శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. 9 మంది గల్లంతు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగల పెంట శ్రీశైలంప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

  • Updated On - 12:47 pm, Fri, 21 August 20 Edited By:
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. 9 మంది గల్లంతు


Srisailam power house fire accident: నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగల పెంట శ్రీశైలంప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి విద్యుత్ తయారీ కేంద్రంలోని మొదటి యూనిట్‌లో భారీ పేలుడు సంభవించి, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. వెంటనే  అప్రమత్తమైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. విధుల్లో ఉన్న వారిలో పది మంది బయటకు రాగా.. 9 మంది గల్లంతు అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గల్లంతైన వారిలో డీఈ శ్రీనివాస్‌, ఏఈలు సుందర్, మోహన్ కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్రావు, రాంబాబు, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. వారి కోసం రెస్క్యూ టీమ్‌ గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Read More:

ఒడిషాలో భారీగా పట్టుబడ్డ గంజాయి

మద్యం మత్తులో మున్సిపల్ అధికారులపై దౌర్జన్యం