Cyclone Jawad: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్‌ల వివరాలు..

జవాద్ తుపాన్ కారణంగా ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

Cyclone Jawad: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్‌ల వివరాలు..
Cyclone Jawad

Updated on: Dec 03, 2021 | 2:52 PM

Cyclone Jawad Updates: జవాద్ తుపాన్ కారణంగా ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  తుపాన్ ప్రభావానికి కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోగా.. కొన్ని చోట్ల చెట్లకొమ్మలు పడి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు నేలకూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యుత్ శాఖ సూచించింది. ఆ మేరకు  ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(APEPDCL) వినియోగదారులకు ఓ విజ్ఞప్తి చేసింది. జవాద్ తుఫాన్ వల్ల ఏర్పడే విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలకు సంబందించిన సమాచారాన్ని ఏపిఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియచేయాలని కోరింది.

తుపాన్ ప్రభావానికి తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిపోయిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. వాటి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం. 1912, కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని APEPDCL సియండి కె.సంతోషరావు విజ్ఞప్తి చేశారు.

కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లు

విశాఖపట్నం కార్పోరేట్ ఆఫీసు
9440816373 / 8331018762

శ్రీకాకుళం 9490612633

విజయనగరం 9490610102

విశాఖపట్నం 7382299975

తూర్పుగోదావరి 7382299960

పశ్చిమగోదావరి 9440902926

Also Read..

Crime news: వివాహేతర సంబంధం పెట్టుకుందని కోడలిని హతమార్చిన మామ.. సైకిల్‌పై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి..

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కేవలం 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. పూర్తి వివరాలు..!