కొత్తిమీరకు ‘కొత్త హోదా’.. విమానంలో ‘రాక’..!

| Edited By:

Nov 07, 2019 | 12:54 PM

ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఇప్పటికి తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం భారీ వర్షాల వలన తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వరంగల్‌లో కిలో కొత్తిమీర ధర బుధవారం రూ.150 పలికింది. […]

కొత్తిమీరకు కొత్త హోదా.. విమానంలో రాక..!
Follow us on

ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఇప్పటికి తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం భారీ వర్షాల వలన తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వరంగల్‌లో కిలో కొత్తిమీర ధర బుధవారం రూ.150 పలికింది. దానిని కూడా పంజాబ్‌ నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని వ్యాపారులతో తాము ఒప్పందం చేసుకున్నట్లు వరంగల్‌లోని లక్ష్మీపురం మార్కెట్‌ వ్యాపారులు తెలిపారు.

ఇదివరకు స్థానికంగా కొత్తిమీర పంటలు దెబ్బతినప్పుడు బెంగళూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకునే వారిమని.. ఇప్పుడు అక్కడ కూడా పంటలు పాడైపోవడంతో పంజాబ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వారు వెల్లడించారు. కాగా ఒక్క కొత్తిమీర మాత్రమే కాదు అన్ని కూరగాయల ధరలు.. సామన్యులకు కంటతడి పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని కూరల్లో విరివిగా వేసుకునే కిలో ఉల్లి వందను తాకిన విషయం తెలిసిందే.