పీవీకి భారతరత్న ఇవ్వాలి- సీఎం కేసీఆర్

బహుభాషా కోవిదుడు, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధానికి అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో (జూన్ 23) మంగళవారం అత్యున్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ…రాష్ట్ర శాసనసభలో పీవీ నరసింహారావు చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇదేవిధంగా పార్లమెంట్‌లో […]

పీవీకి భారతరత్న ఇవ్వాలి- సీఎం కేసీఆర్

Updated on: Jun 23, 2020 | 8:25 PM

బహుభాషా కోవిదుడు, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధానికి అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో (జూన్ 23) మంగళవారం అత్యున్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ…రాష్ట్ర శాసనసభలో పీవీ నరసింహారావు చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇదేవిధంగా పార్లమెంట్‌లో సైతం పీవీ చిత్రపటం నెలకొల్పాలన్నారు. హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌ ఏర్పాటుకు కేకే నేతృత్వంలో కమిటీ పనిచేస్తుందని అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఈ 28న ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో నిర్వహించనునట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ వేడుకల నిర్వహణను మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షిస్తారని అన్నారు.  ఉత్సవాల నిర్వహణకు తక్షణమే రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.