
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై అనంతపురం రూరల్ పీఎస్‌లో కేసు నమోదైంది. జేసీ తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. బెదిరింపులకు పాల్పడ్డారంటూ పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. దీంతో జేసీపై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో పోలీసులను ఉద్దేశిస్తూ.. జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీస్ అధికారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.