బయోమెట్రిక్ హాజరు ద్వారానే వేతనాలు.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు

| Edited By:

Aug 25, 2020 | 7:44 AM

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

బయోమెట్రిక్ హాజరు ద్వారానే వేతనాలు.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు
Follow us on

AP Secretariat Employees: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ హాజరు ద్వారానే వేతనాలు చెల్లిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక బయోమెట్రిక్ హాజరుతో వేతనాల చెల్లింపును లింక్ చేయాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను సర్కార్ ఆదేశించింది. బయోమెట్రిక్ హాజరు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కాగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి బయోమెట్రిక్ హాజరుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే.

Read More:

అవినీతి నిర్మూలన ఎలా..: సీఎం జగన్‌కి ఐఐఎం నివేదిక

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!