Atchannaidu : ‘సెలవు రోజుల్లో విధ్వంసం’ పేరుతో ఏపీలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టండి.. ‘ఇంతకీ.. వాళ్లంతా ఎలా చనిపోయినట్టు..?’

|

Jun 14, 2021 | 5:06 PM

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూములపై అధికారుల దాడిని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.

Atchannaidu : సెలవు రోజుల్లో విధ్వంసం పేరుతో ఏపీలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టండి..  ఇంతకీ.. వాళ్లంతా ఎలా చనిపోయినట్టు..?
Atchannaidu
Follow us on

AP TDP Chief Atchannaidu : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూములపై అధికారుల దాడిని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కట్టింది ఒక్కటీ లేకపోయినా, విధ్వంసాలు మాత్రం చేస్తూనే ఉందని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రశ్నించిన వారి ఆస్తులను కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకొని భయోత్పాతం సృష్టిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

‘సెలవురోజుల్లో విధ్వంసం’ పేరుతో ఏపీలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేసిన అచ్చెన్న, గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన భూములపై అనేక పరిశీలనలు చేశారని.. ఎక్కడా ఏమీ దొరక్క చివరకు ఒక చెరువుకు చెందిన రెండు అడుగుల స్థలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ ఫెన్సింగ్ తీసేశారని అసహనం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో ఏపీ సర్కారు పూర్తిగా విఫలమైందన్న అచ్చెన్న, ఈ ఏడాది మే నెలలో 2,938 మంది కరోనాతో మరణించారని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఏపీ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాలు పరిశీలిస్తే మే నెలలో 1,03,745 మంది చనిపోయినట్టు వెల్లడవుతోందని అచ్చెన్న అన్నారు.

2018, 2019 సంవత్సరాల మే నెలల్లో గరిష్ఠంగా నమోదైన మరణాలు 27,100 గా ఉంటే, సర్కారు చెబుతున్న 2,938 కరోనా మరణాలు తీసేస్తే… మిగతా వారంతా ఏలా చనిపోయారో అన్నది పెద్ద మిస్టరీ అని అచ్చెన్న సందేహాలు వెలిబుచ్చారు. ఇప్పటికే విశాఖలో వెలగపూడి రామకృష్ణబాబు, సబ్బం హరి, గీతం విద్యా సంస్థలపై ఆక్రమణల పేరుతో విధ్వంసం సృష్టించి భయాందోళనకు గురి చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ప్రశాంతతను దూరం చేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అచ్చెన్నాయుడు శాపనార్థాలు పెట్టారు.

Read also :