Chandrababu letter : ‘సీఎం జగన్ కూడా ఇలా చేయాలి’ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చంద్రబాబు లేఖ

|

Jul 23, 2021 | 6:35 PM

విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి లేఖ రాశారు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు..

Chandrababu letter : సీఎం జగన్ కూడా ఇలా చేయాలి  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చంద్రబాబు లేఖ
Chandrababu Naidu
Follow us on

Chandrababu – Vizag Steel : విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి లేఖ రాశారు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో తెలుగు ప్రజలు 1960 లలో ప్రాంతం, మతం, కులాలకు అతీతంగా పోరాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నారని చంద్రబాబు తన లేఖలో గుర్తు చేశారు. మన సామూహిక, ఐక్య పోరాటం మాత్రమే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నుండి కాపాడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగు దేశం పార్టీ తరపున, వ్యక్తిగతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకత్వంలో జరుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ పోరాటానికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ కూడా తన మద్దతు తెలిపి పోరాటంలో భాగస్వామ్యమై ఉద్యమాన్ని నడిపించడం అత్యవసరమన్నారు చంద్రబాబు. స్టీల్ ప్లాంటును రక్షించుకునేందుకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి మద్దతుగా టీడీపీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

“2000 సంవత్సరం నాటికి స్టీల్ ప్లాంట్ రూ. 4000 కోట్లు నష్టాలలో కూరుకుపోగా అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ప్లాంటును ప్రైవేటీకరించాలని ప్రతిపాదించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి, నా వ్యక్తిగత అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1,333 కోట్లు ప్లాంట్‌ను లాభదాయకంగా మార్చేందుకు ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో, తెలుగు దేశం పార్టీ తరపున మరియు నా వ్యక్తిగతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకత్వంలో జరుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ పోరాటానికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను.” అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

Read also: SC Corporation : తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించిన సీఎం కేసీఆర్. ఇంతకీ.. ఎవరితను..?