సీతానగరం శిరోముండనం కేసు: ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

| Edited By:

Sep 09, 2020 | 9:28 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది

సీతానగరం శిరోముండనం కేసు: ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Follow us on

Sitanagaram tonsuring case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితులపై తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు నమోదు తరువాత తదుపరి చర్యలు నిలువరించాలని ఆరుగురు నిందితులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది. అయితే వైసీపీ నేత కవల కృష్ణమూర్తి అతని అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ప్రసాద్ ఆరోపించారు. ఇక ఈ కేసుపై బాధితుడి ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించింది. ఈ కేసును తక్షణం విచారించేలా ఫైలును సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో ప్రసాద్ చెప్పేవన్నీ అబద్దాలని ప్రమాదంలో కాళ్లు విరిగి గాయపడ్డ విజయ్ బాబు వెల్లడించిన విషయం తెలిసిందే.

Read More:

అమరావతిని విస్మరించలేదు.. రాజధానిపై జగన్ స్పష్టత

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,479 కొత్త కేసులు.. 10 మరణాలు