విజయవాడ అగ్ని ప్రమాదం: విచారణ కమిటీ ఏర్పాటు

విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి జేసీ(అభివృద్ధి)

విజయవాడ అగ్ని ప్రమాదం: విచారణ కమిటీ ఏర్పాటు

Edited By:

Updated on: Aug 09, 2020 | 9:44 PM

Swarna Palace Accident: విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి జేసీ(అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ నేతృత్వం వహించనుండగా.. సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, వీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జి.గీతాబాయి, ఆర్‌ఎఫ్‌వో ఉదయ్‌కుమార్‌, విద్యుత్‌ డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌లు సభ్యులుగా‌ ఉన్నారు. ఈ కమిటీ ప్రమాద కారణాలు, భద్రతా నిబంధనలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో నిర్వహణ లోపాలు, అధిక ఫీజుల వసూలపై దృష్టి సారించాలని, రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని పాలనాధికారి కమిటీని ఆదేశించారు. విచారణలో భాగంగా స్వర్ణ ప్యాలెస్‌లోని సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌లను కమిటీ స్వాధీనం చేసుకుంది.

Read This Story Also: వెలగపూడి గోపాలకృష్ణపై ఏపీ బీజేపీ సస్పెన్షన్ వేటు