ఇసుకపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం..!

| Edited By:

Jul 27, 2020 | 10:56 AM

ఇసుకకు సంబంధించి జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంటోంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకున్న తరువాత.. నాణ్యమైనది సరఫరా అవ్వకపోతే దాన్ని వెనక్కి పంపే అవకాశాన్ని కొనుగోలుదారులకు ఇవ్వనున్నారు.

ఇసుకపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం..!
Follow us on

AP Government Sand Issues: ఇసుకకు సంబంధించి జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంటోంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకున్న తరువాత.. నాణ్యమైనది సరఫరా అవ్వకపోతే దాన్ని వెనక్కి పంపే అవకాశాన్ని కొనుగోలుదారులకు ఇవ్వనున్నారు. అలాగే మళ్లీ వారికి నాణ్యమైన ఇసుక అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఏపీఎండీసీ ప్రతిపాదన సిద్ధం చేస్తుండగా.. దీనిపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.

కాగా ఇంటికి డెలివరీ చేసిన ఇసుక నాణ్యత లేదని, మట్టితో వస్తోందని పలువురి నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఇసుక నిర్మాణాలకు ఉపయోగపడం లేదంటూ.. చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్‌కి సైతం ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై ఆయన కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు కొన్ని నెలల కిందట జరిగిన ఇసుక తవ్వకాల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రిపోర్ట్‌ను ఏపీఎండీసీకి అందజేశారు. ఈ లెక్కలపై మరోసారి డ్రోన్ ద్వారా సర్వే చేయించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది.

Read This Story Also: Breaking: ‘హనుమాన్ జంక్షన్‌’ నటి విజయలక్ష్మి‌ ఆత్మహత్యాయత్నం