Visakhapatnam: దస్‌పల్లా భూములపై సాగుతున్న పంచాయితీ.. సుప్రీం ఆదేశాలను అమలు చేయలని ల్యాండ్‌ ఓనర్ల విజ్ఞప్తి

|

Oct 09, 2022 | 8:30 AM

స్‌పల్లా భూములను 22-Aలో కొనసాగించి.. ప్రభుత్వ భూములుగా తీర్పు వచ్చే వరకు పోరాడుతామంటోంది టీడీపీ. ఈ క్రమంలో అష్యూర్ ఎస్టేట్‌ డెవలపర్స్‌తో పాటు స్థల యజమానులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Visakhapatnam: దస్‌పల్లా భూములపై సాగుతున్న పంచాయితీ.. సుప్రీం ఆదేశాలను అమలు చేయలని ల్యాండ్‌ ఓనర్ల విజ్ఞప్తి
Daspalla Lands
Follow us on

విశాఖపట్నంలోని దస్‌పల్లా రాణి కమలాదేవికి.. ప్రభుత్వానికి మధ్య వందల కోట్ల విలువ చేసే భూముల ఇష్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. 1981 నుంచి భూముల వివాదంపై వేర్వేరు కోర్టుల్లో కేసులు నడిచాయి. అన్ని న్యాయస్థానాల్లోనూ కమలాదేవికి అనుకూలంగానే తీర్పులొచ్చాయి. 2014లో దస్‌పల్లా భూములను ప్రైవేట్‌ భూములుగా పరిగణించి 22-A జాబితా నుంచి తొలగించాలని సుప్రీం ఆదేశాలిచ్చింది. కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో అప్పటి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కి నెలరోజుల జైలు శిక్ష కూడా విధించింది. దస్‌పల్లా భూములను 22-Aలో కొనసాగించి.. ప్రభుత్వ భూములుగా తీర్పు వచ్చే వరకు పోరాడుతామంటోంది టీడీపీ. ఈ క్రమంలో అష్యూర్ ఎస్టేట్‌ డెవలపర్స్‌తో పాటు స్థల యజమానులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సుప్రీం కోర్టు టైటిల్ నిర్ధారించాక కూడా ఇబ్బంది ఎదురవుతుందని అనుకోలేదన్నారు కమలారాణి అడ్వకేట్‌ సుబ్బరాజు. మరోవైపు భూములపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు స్థల యజమానులు, అష్యూర్ డెవలపర్స్‌. రియల్టర్ల నుంచి నిధులు వస్తున్నాయన్న వార్తల్ని ఖండించారు. ఫైనల్‌గా దస్‌పల్లా భూములను 22-A జాబితా నుంచి తొలగించాలన్న సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని రిక్వెస్ట్ చేశారు.

మరోవైపు చాలా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఒక చదరపు గజానికి 12 చదరపు అడుగులను డెవలపర్‌కి ఇచ్చేలా అగ్రిమెంట్‌ చేసుకున్నామన్నారు బిల్డర్ జాస్తి బాలాజీ. దస్‌పల్లా భూములపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇస్తూనే.. కోర్టు నిర్ణయాన్ని అమలు చేయాలని విఙ్ఞప్తి చేశారు ల్యాండ్ ఓనర్లు, అష్యూర్ డెవలపర్స్‌. మరి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..