Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమం ఉధృతం .. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ నినాదంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ ఉండనుంది. ఈ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ..

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమం ఉధృతం .. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌
Vizag Stleel Plant

Edited By: Anil kumar poka

Updated on: Mar 05, 2021 | 8:47 AM

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ నినాదంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ ఉండనుంది. ఈ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలనే నినాదంతో తలపెట్టిన ఈ బంద్‌ను తాము పూర్తిగా సహకరిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేలా ఐక్య కార్యాచరణ చేపట్టనున్నారు. అయితే నష్టాల పేరుతో బడా కార్పొరేట్‌ సంస్థలకు విశాఖ ఉక్కును ధారాదత్తం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాలు నినదిస్తున్నాయి.

కాగా, గత ఐదు రోజులుగా ఏపీలో పలు రాజకీయ పార్టీలు, సంఘాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బంద్‌ను విజయవంతం చేసి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాయి. సీపీఎం, సీపీఐలతోపాటు పలు కార్మిక సంఘాలతో విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. వర్తక, వ్యాపార సంస్థలతోపాటు విద్యాసంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లను స్వచ్ఛదంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలకాలని కోరారు. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేలా తాము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. బంద్‌ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు.

ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. మహిళా దినోత్సవం పురస్కరించుకుని జగన్ కానుక.. మొబైల్‌ ఫోన్‌ కొన్నవారికి.. 10 శాతం రాయితీ