Andhra News: పెట్రోల్‌ట్యాంక్‌పై పడిన పిడుగు.. భారీగా చెలరేగిన మంటలు.. అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది!

విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌‌లోని పెట్రోలియం ట్యాంక్‌పై పిడుగు పడడంతో భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Andhra News: పెట్రోల్‌ట్యాంక్‌పై పడిన పిడుగు.. భారీగా చెలరేగిన మంటలు.. అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది!
Representative Image(not No

Updated on: Sep 07, 2025 | 4:29 PM

విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. ఆదివారం మధ్యాహ్నం HPCL పరిధిలో ఉన్న EIPL ఎనర్జీ కంపెనీ పెట్రోలియం ట్యాంక్‌పై పిడుగు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్తా ఫ్యాక్టరీ పరిసరాల్లోకి వ్యాపించాయి. దీంతో కంపెనీ వద్ద భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే అలర్ట్‌ అయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రమాద స్థలం పెట్రోలియం నిల్వ ఉండే ప్రాంతం కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

అదే సమయంలో ప్రమాద సమాచారం అందుకున్న HPCL, EIPL అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కంపెనీలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఎవరైనా గాయపడితే వెంటనే హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.