నిత్యం బాలుడికి నరకం చూపిస్తున్న మేనమామ

ప్రకాశం జిల్లా చీరాలలోని రంగారెడ్డినగర్లో తొమ్మిదేళ్ల బాలుడికి ఒంటినిండా వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడి తండ్రి చనిపోవడంతో తల్లి వదిలేసి వెళ్లిపోయింది. దీంతో బాలుడిని చేరదీసిన అమ్మమ్మ ఆలనాపాలనా చూసుకుంటోంది. బాలుడి మేనమామ షేక్ నుభాని చెడు వ్యసనాలకు బానిసై నిత్యం మద్యం సేవించి, ఇంటికొచ్చి పల్లవాడిని చితకబాదేవాడు. బాలుడు స్కూల్ కు వెళ్లకుంటే చిత్రహింసలకు గురిచేసేవాడు. కత్తిని కాల్చి చెట్టుకు కట్టేసి ఒంటినిండా […]

నిత్యం బాలుడికి నరకం చూపిస్తున్న మేనమామ

Edited By:

Updated on: Feb 16, 2019 | 11:12 AM

ప్రకాశం జిల్లా చీరాలలోని రంగారెడ్డినగర్లో తొమ్మిదేళ్ల బాలుడికి ఒంటినిండా వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడి తండ్రి చనిపోవడంతో తల్లి వదిలేసి వెళ్లిపోయింది. దీంతో బాలుడిని చేరదీసిన అమ్మమ్మ ఆలనాపాలనా చూసుకుంటోంది. బాలుడి మేనమామ షేక్ నుభాని చెడు వ్యసనాలకు బానిసై నిత్యం మద్యం సేవించి, ఇంటికొచ్చి పల్లవాడిని చితకబాదేవాడు. బాలుడు స్కూల్ కు వెళ్లకుంటే చిత్రహింసలకు గురిచేసేవాడు. కత్తిని కాల్చి చెట్టుకు కట్టేసి ఒంటినిండా వాతలు పెట్టి రాక్షసంగా ప్రవర్తించేవాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మేనమామ సుభానీపై చర్యలు తీసుకుంటామని చైల్డ్ వెల్ఫేర్ సంస్థ తెలియజేసింది.

Follow Us