Sabbam Hari: విశాఖపట్నం మాజీ మేయర్, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కరోనా బారిన పడిన హరి.. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా సబ్బ హరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సబ్బ హరికి ఈనెల 15న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు మూడు రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ నేథ్యంలో, సబ్బం హరి ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా మారిందని డాక్టర్లు వెల్లడించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయనకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు తెలుస్తోంది. సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. హరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు. అయితే సబ్బం హరి విశాఖపట్నం మేయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో మాజీ ఎంపీ సబ్బం హరి ఒకరు.
Corona Effect: ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు.. బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక