Andhra News: భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్తున్న సివిల్ ఇంజనీర్ లాస్ట్ మెసేజ్!

విశాఖలో షిప్పింగ్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ హర్షవర్ధన్ స్టాక్ మార్కెట్ నష్టాలు, రూ.36 లక్షల అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. తాను కొడుకుగా, తండ్రిగా, భర్తగా విఫలమయ్యానని భార్యకు సందేశం పంపి, దువ్వాడ రైల్వేస్టేషన్ వద్ద రైలు కిందపడ్డారు. భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా, దర్యాప్తులో ఆర్థిక ఇబ్బందులే కారణమని తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra News: భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్తున్న సివిల్ ఇంజనీర్ లాస్ట్ మెసేజ్!
Vizag Engineer Suicide

Edited By:

Updated on: Feb 05, 2026 | 6:06 PM

అతనో సివిల్ ఇంజనీర్.. అతనికి పెళ్లై భార్య, ఓ కూతురు ఉంది. అయితే బుధవారం ఉన్నట్టుండి ఊరెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. భర్త వెళ్లిన కాసేపటికే ఇంట్లో ఉన్న అతని ఫోన్‌ గుర్తించిన భార్య.. ఇచ్చేందుకని దాన్ని తీసుకొని బయల్దేరింది. అంలోనే ఆమెకు ఫోన్‌లో ఓ మెసేజ్ కనిపించింది.’కొడుకుగా, తండ్రిగా, భర్తగా నేను ఫెయిల్ అయ్యాను.. పాపను జాగ్రత్తగా చూసుకో అని రాసి ఉంది. అది చూసిన భార్య కంగారు పడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కానీ అంతలోనే ఊహించని విషాదం వాళ్లను ముంచెత్తింది. ఊరెళ్లొస్తానని చెప్పిన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఆమె తెలుసుకుంది. ఈ ఘన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

విరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలో బొమ్మసముద్రంకు చెందిన చల్లగుండ్ల హర్షవర్దన్‌.. భార్య, కుమార్తెతో కలిసి విశాఖలో నివాసం ఉంటున్నారు. పెదగంట్యాడలోని వినాయకనగర్‌ వుడా కాలనీలో కుటుంబం నివాసం. పొట్టకూటి కోసం విశాఖ వచ్చేసిన హర్షవర్దన్‌.. పదిహేనేళ్లుగా షిప్పింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్నారు. ఊరు వెళుతున్నానని భార్యకు చెప్పి ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వచ్చిన హర్షవర్దన్‌.. దువ్వాడ రైల్వేస్టేషన్‌ సమీపంలో జన్మభూమి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

బయలుదేరడానికి ముందే భార్యకు మెసేజ్..

ఇంటి నుంచి బయలుదేరడానికి ముందే భార్యకు ఫోన్‌లో మెసేజ్‌ పెట్టాడు హర్షవర్ధన్. స్టాక్‌ మార్కెట్‌లో నష్టాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని.. బంధువులు, స్నేహితులు, పనిచేసే చోట అప్పులు చేశానని ఆ మెసేజ్ లో రాసుకొచ్చాడు. తాను కొడుకు, భర్త, తండ్రిగా ఫెయిలయ్యానని భావోద్వేగానికి గురయ్యాడు. కుమార్తెను బాగా చూసుకోవాలని భార్యకు చెప్పాడు. తన మొబైల్ ఫోను ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. భర్త వెళ్లిన కొద్దిసేపటికి ఆ మెసేజ్‌ చూసిన భార్య.. వెంటనే న్యూపోర్టు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

అప్రమత్తమైన పోలీసులు.. అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇచ్చి గాలింపు చేపట్టారు. చివరకు జీఆర్పీ పోలీసులకు దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ డెడ్‌బాడీ దొరికినట్టు సమచారం వచ్చింది. వెంటనే అక్కడకు వెళ్లి చూసేసరికి ఓ మృతదేహం ముక్కలుగా పడి ఉంది. ధరించిన భట్టల ఆధారంగా ఆ మృతదేహం హర్షవర్ధన్ దేనని గుర్తించారు పోలీసులు. జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య అతను చేసుకున్నట్టు నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు.

నిండా ముంచేసిన స్టాక్ మార్కెట్

అయితే పోలీసుల దర్యాప్తులో హర్షవర్ధన్ స్టాక్ మార్కెట్లో తీవ్రంగా నష్టపోయినట్టు.. బంధువులు స్నేహితులు పనిచేసే చోట నుంచి దాదాపుగా రూ. 36 లక్షల వరకు అప్పులు చేసి ఆర్థిక భారంతో ఉన్నట్టు గుర్తించారు. భార్యకు పెట్టిన మెసేజ్ లోనూ అదే అంశాన్ని ప్రస్తావించడంతో ఆర్థిక భారంతో మనస్థాపం చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.