Vizag: హలో వైజాగ్‌..కారవాన్‌ బస్‌ రెడీ

విశాఖ పర్యాటకులకు గుడ్ న్యూస్‌. కారవాన్ టూరిజానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో స్టార్ హోటల్ స్థాయి సదుపాయాలతో కూడిన లగ్జరీ కారవాన్ బస్సు త్వరలో అందుబాటులోకి రానుంది. 1.4 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధమైన ఈ వాహనం ద్వారా పర్యాటకులు అరకులోయ, లంబసింగి, పాడేరు వంటి ప్రాంతాలను సౌకర్యవంతంగా సందర్శించే వీలు కలుగుతుంది.

Vizag: హలో వైజాగ్‌..కారవాన్‌ బస్‌ రెడీ
Caravan Bus

Updated on: Oct 03, 2025 | 6:41 PM

కారవాన్‌ టూరిజానికి ఏపీ కేబినెట్‌ అలా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందో లేదో…విశాఖవాసులకు ఇలా గుడ్‌ న్యూస్‌ వచ్చేసింది. యస్‌. హలో వైజాగ్.. అన్నవారికి మరో గుడ్ న్యూస్ ఇది! మీకోసం కారవాన్ బస్సు సిద్ధంగా ఉంది. మరి కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి వస్తుంది. ఎంచక్కా ఆ బస్సులో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి లగ్జరీ గా ప్రయాణించవచ్చు.. బస్సులోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ప్రత్యేకంగా పడకలు.. ఇంకా ఎన్నెన్నో సదుపాయాలు ఉంటాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే, ఇది ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఆన్‌ వీల్స్‌. విశాఖలో ఈ కారవాన్‌ బస్‌ అందుబాటులోకి వస్తోంది.

విశాఖకు చెందిన శివాజీ తన ముగ్గురు స్నేహితులతో కలిసి రూ. 1.4 కోట్ల వ్యయంతో సమకూర్చుకున్న ఈ వాహనాన్ని.. APTDCతో ఒప్పందం చేసుకొని పర్యాటకులకు అందుబాటులోకి తెస్తున్నారు. త్వరలోనే విశాఖ నుంచి అరకులోయ, పాడేరు, లంబసింగి తదితర పర్యాటక ప్రాంతాలకు దీన్ని నడుపుతారు. దీంతోపాటు పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా మిగతా ప్రాంతాలకు కూడా ఈ బస్సులో వెళ్లే అవకాశం కల్పిస్తారు. త్వరలో టూర్‌ ప్యాకేజీ వివరాలను ప్రకటిస్తామంటున్నారు నిర్వాహకులు.

కార్వాన్ అంటే సమూహం. వేరువేరుగా కాకుండా ఒక సమూహంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేసేందుకు ఈ వాహనాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలి అంటే మొబైల్ హాలీడ్ వెహికల్‌ అన్నమాట. సెలవుల్లో సరదాగా టూరిస్ట్ ప్లేసులు చుట్టి వచ్చేయాలి అనుకునే ఫ్యామిలీస్ కి ఇవి బెస్ట్ అప్షన్. వీటిలో ప్రయాణంతో పాటు ప్లస్ బస చేసే అప్షన్ కూడా ఉంటుంది. అధునాతన హంగులతో ఈ వాహనాన్ని తీర్చిదిద్దారు.

లగ్జరీ ట్రావెల్‌. స్టార్ హోటల్‌ని మరిపించే సదుపాయాలు ఈ కారవాన్ బస్సు సొంతం. చాలా టూరిస్ట్ ప్లేసుల్లో స్టేకి సరైన సదుపాయాలు ఉండవు. అలాగే ప్రయాణాల్లో మహిళలు, చిన్న పిల్లలు వాష్ రూమ్‌ల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలకు ఈ కార్వాన్ బస్సులు బెస్ట్ ఆప్షన్.. వీటిలో కూర్చునేందుకు లగ్జరీ సిటింగ్, విశ్రాంతి తీసుకునేందుకు బెడ్లు, ఫ్రిజ్‌, వాష్ రూమ్ సదుపాయాలు ఉన్నాయి. అంతేకాదు ఏవైనా వస్తువులను అప్పటికప్పుడు వేడి చేసి తినేందుకు ఓవెన్ సదుపాయం కూడా కల్పించారు. AC, వైఫై, టీవీ వంటి సౌకర్యాలు ఉంటాయి. ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక బంకర్ బెడ్ ను ఏర్పాటు చేశారు. దీన్ని స్టార్ హోటల్ రూమ్ ఆన్ వీల్స్ అని చెప్పుకోవచ్చు.

సుందర విశాఖ నగరం తో పాటు అరకులోయ లాంటి ఏజెన్సీ ప్రాంతాలను, నిజమైన ప్రకృతి అందాలను వీక్షించాలి అంటే అడవులు, కొండలు, బీచ్‌ల వంటి ఏరియాల్లోకి వెళ్ళాలి. అక్కడికి సొంత వాహనంలో వెళ్తే మరిన్ని సౌకర్యాలు వెతుక్కోవాల్సి ఉంటుంది.. అదే క్యారవాన్ లో వెళ్తే ఆ ప్రాబ్లమ్ ఉండదు. 15 మంది కుటుంబ సభ్యులు గాని ఫ్రెండ్స్ గాని ఒకేసారి కూర్చొని ట్రావెల్ చేసే అవకాశం ఇందులో ఉంటుంది. డ్రైవర్ తో పాటు ఒక గైడ్ కూడా అందుబాటులో ఉంటాడు.