Very Rare Butterfly: మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి ఎంతో అందమైనది..అందులోని రకరకాల మొక్కలు, పూలు ఇంకా మరింత అందమైనవి..అలాంటి వాటికి మరింత సౌందర్యాన్ని తీసుకొచ్చేవి.. సీతాకోక చిలుకలు. అలాంటి సీతాకోక చిలుకల్లో ఎన్ని రకాలు ఉంటాయో ఎవరికీ తెలియదనే చెప్పాలి..అలాంటిదే ఇక్కడ ఓ వింత సీతాకోక చిలుక హల్‌చల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించిన ఈ వింత సీతాకోక చిలుకను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.
ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపల్ పరిధి ముస్తాపురం సమీపంలోని తోటల్లో ఓ వింతైన సీతాకోక చిలుక కనువిందు చేసింది.. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి ఇంటి సమీపంలోని ఒక చెట్టుపై ఈ వింత బట్టర్‌ఫ్లైని చూసిన ఆ ఇంటి యజమానికి తొలుత కంగారు పడ్డాడట… ఆ తర్వాత తేరుకుని దానిని నిశితంగా గమనించాడు. దూరం నుంచి చూస్తే అది నాగుపాము పడగను పోలి ఉంది. రెక్కలు విప్పితే దాని శరీరంపై వింతైన కళ్ల మాదిరిగా కనిపించింది. దగ్గరగా పరిశీలించిన చూసిన అతడు అది సీతాకోక చిలుక అని నిర్దారించుకున్నాడు. వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వింత బట్టర్‌ఫ్లై ఇప్పుడు నెట్టింట వైరల్‌గామారి తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి