Viral Photo: దేవుడా.. రోడ్డు పక్కన ఇంత పెద్ద గోతి ఎంట్రా బాబు.. పాపం ఉద్యోగి

పాపం ఆ ఉద్యోగి. కేబుల్స్ వేసిన సంస్థ వివరం లేని పనితో ఇబ్బంది పడ్డాడు. బండి కాస్త స్పీడ్ తక్కువ ఉండబట్టి సరిపోయింది కానీ.. 80 స్పీడ్‌తో వెళ్లి ఉంటే మాత్రం అతడి నడుములు విరిగిపోయేవి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Viral Photo: దేవుడా.. రోడ్డు పక్కన ఇంత పెద్ద గోతి ఎంట్రా బాబు.. పాపం ఉద్యోగి
Bike Accident

Updated on: Jun 01, 2023 | 3:12 PM

ఇప్పటికే లేట్ అయ్యింది. తొందరగా ఆఫీస్‌కి వెళ్లాలి అని హడావుడిగా రయ్ రయ్ మంటూ బైక్‌పై దూసుకెళ్తున్న ఓ ఉద్యోగి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న గోతిలో బోర్లా పడ్డాడు. జరిగిన ఘటనతో షాక్ కు గురైన ఆ ఉద్యోగి కొంత తేరుకొని చూసేసరికి సగం బైక్ గోతిలో కూరుకుపోయింది. పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను దేవుడా అని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఇటీవల టెలికాం కేబుళ్లు వేసేందుకు రహదారులపై గోతులు తవ్వారు సంస్థ నిర్వాహకులు.. కేబుల్స్ వేసిన సంస్థ పని పూర్తయిన తరువాత గోతులు మాత్రం పూడ్చలేదు. అంతేకాకుండా కనీసం ప్రమాదకర హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు.

అలా ఎక్కడి గోతులు అక్కడ గోతులు వదిలేయటంతో కొత్తవలస జడ్పీ హైస్కూల్ వద్ద రోడ్డు పక్కన ఉన్న గోతిలో ఈ ఉద్యోగి పడ్డాడు. సమాచారం అధికారులకు తెలియజేస్తే కేబుల్స్ వేసిన సంస్థ గోతులు పూడ్చాలి కానీ తనకేమి సంబంధం అని సమాధానం ఇస్తున్నారు. కేబుల్ వేసిన టెలికాం సంస్థ జాడ తెలియకపోవడంతో ఇప్పుడు ఈ గోతులు ఎవరు, ఎప్పుడు పూడుస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ఇంకా ఎంత మంది ఈ గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడాలో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..