Watch Video: మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. వైద్యసేవలపై స్థానికుల విమర్శలు..

| Edited By: Janardhan Veluru

Jul 06, 2024 | 2:39 PM

పార్వతీపురం మన్యంజిల్లా సాలూరు మండలంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ హాస్టల్స్‌, బాలికల ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలో బాలికలు జ్వరాల బారిన పడ్డారు. ఏపీలో మొన్నటి వరకూ డయేరియా విజృంభించింది. విజయవాడతోపాటూ పలు జిల్లాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీనిపై మున్సిపల్ శాఖమంత్రి నారాయణ అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా జరిపారు. జూలై నాటికి పారశుధ్ద్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Watch Video: మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. వైద్యసేవలపై స్థానికుల విమర్శలు..
Manyam District
Follow us on

పార్వతీపురం మన్యంజిల్లా సాలూరు మండలంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ హాస్టల్స్‌, బాలికల ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలో బాలికలు జ్వరాల బారిన పడ్డారు. ఏపీలో మొన్నటి వరకూ డయేరియా విజృంభించింది. విజయవాడతోపాటూ పలు జిల్లాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీనిపై మున్సిపల్ శాఖమంత్రి నారాయణ అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా జరిపారు. జూలై నాటికి పారశుధ్ద్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంటువ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో వైరల్ ఫీవర్ ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రభుత్వ హాస్టల్స్ లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. వ్యాధి బారిన పడిన విద్యార్థినులకు మామిడిపల్లి PHCలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. సాలూరు మండలంలోని ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్లలో మలేరియా కిట్లు, మెడిసిన్స్ అందుబాటులో లేకపోవడంతో బాధితులు త్వరగా కోలుకోలేకపోతున్నారు. జ్వరం తీవ్రంగా ఉన్న కొందరు బాలికలను సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. విషజ్వరాలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ.. అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికంగా ఉన్న ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆయా శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటువ్యాధులు విజృంభించకుండా అడ్డుకట్టవేయాలని కోరుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..