తేజస్వి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు..

విద్యార్ధిని తేజస్వి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు కేసులో వేగం పెంచారు. తేజస్విని ఆచూకీ కోసం కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ స్పెషల్ టీంను పంపారు. తేజస్విని మిస్సింగ్ కేసులో నిన్న స్వయంగా మాచవరం సీఐకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. విద్యార్థిని తేజస్వీ మిస్సింగ్ ఘటనపై ఆరాతీశారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తేజస్వి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు..
Deputy Cm Pawan Kalyan

Updated on: Jun 23, 2024 | 5:57 PM

విజయవాడ, జూన్ 23: విద్యార్ధిని తేజస్వి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు కేసులో వేగం పెంచారు. తేజస్విని ఆచూకీ కోసం కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ స్పెషల్ టీంను పంపారు. తేజస్విని మిస్సింగ్ కేసులో నిన్న స్వయంగా మాచవరం సీఐకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. విద్యార్థిని తేజస్వీ మిస్సింగ్ ఘటనపై ఆరాతీశారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత తేజస్విని తల్లి శివ కుమారి తన కూతురు ఆచూకీ తెలిపేలా చూడాలని విన్నవించుకున్నారు.

ఈ మిస్సింగ్ ఘటనపై సీఐ గునరాము టీవీ9తో మాట్లాడారు. కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. బాలిక తేజస్విని కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసు గురించి స్వయంగా ఫోన్ చేసి అడిగారని చెప్పారు. ఆ తరువాత తాను కేసు పురోగతిని వివరించానని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. తేజస్విని మైనర్ కాదని స్పష్టం చేశారు. 8 నెలల క్రితమే తేజస్విని తన సీనియర్‎తో కలిసి వెళ్ళిపోయిందని చెప్పారు. అంజాద్ అనే యువకుడు తీసుకొని వెళ్లినట్లు తెలిపారు. తాజాగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసుపై ఫోకస్ చేయడంతో ఇద్దరి బంధువులు,స్నేహితులు కాలేజీ సిబ్బందిని పిలిచి విచారిస్తున్నామన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం చేశామని తెలిపారు. త్వరలోనే తేజస్విని ఆచూకీ తెలుసుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…