Vijayawada: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. సిట్‌ సంచలన ప్రకటన.. !

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ (SIT) సంచలన ప్రకటన చేసింది. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో అక్రమ నిర్బంధం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే సాయికృష్ణ మృతి చెందాడని సిట్ నివేదిక కోర్టుకు సమర్పించింది. మృతదేహాన్ని తరలించి ఆధారాలు మాయం చేసినట్లు, సీఐ నాగరాజుతో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.

Vijayawada: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. సిట్‌ సంచలన ప్రకటన.. !
Sit Confirms Sai Krishna Died

Updated on: Sep 18, 2026 | 9:01 PM

విజయవాడ: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సాయికృష్ణను కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం వల్లే అతడు మృతి చెందినట్లు సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నివేదికలో పేర్కొంది. ఈ కేసులో సీఐ నాగరాజుతో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై ఆరోపణలు నమోదయ్యాయి.

సిట్ నివేదిక ప్రకారం.. పోలీసుల దాడుల అనంతరం సాయికృష్ణ లాకప్‌లోనే మృతి చెందినట్లు దర్యాప్తులో తేలినట్లు పేర్కొంది. అనంతరం మృతదేహాన్ని తరలించి దహనం చేయడం ద్వారా ఆధారాలను మాయం చేసినట్లు సిట్ నివేదికలో పేర్కొంది. పోలీస్‌స్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజీ, ఇతర ఆధారాల తొలగింపుపైనా దర్యాప్తు కొనసాగినట్లు సిట్ అధికారులు తెలిపారు.

ఈ కేసులో సీఐ నాగరాజుతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు సహా పలువురిని సిట్ విచారించింది. నాగరాజును కూడా సిట్ కస్టడీలోకి తీసుకుని పలు అంశాలపై ప్రశ్నించింది. అనంతరం నలుగురు కానిస్టేబుళ్లను ఐదు రోజులపాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న విధానం, పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పరిణామాలు, మృతదేహం తరలింపు, ఆధారాల తొలగింపు వంటి అంశాలపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే, సిట్ ఆరోపణలు కోర్టు తుది తీర్పుతో నిర్ధారించాల్సి ఉంటుంది. కేసులో నిందితుడైన మాజీ సీఐ నాగరాజు మాత్రం తాను నిర్దోషినని గతంలో కోర్టుకు లేఖ రాశాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us