ఆపరేషన్ థియేటర్‌లో పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్పిటల్‌లో ఆ రాత్రి ఏం జరిగింది?

విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. హాస్పిటల్‌లో చదువుతున్న ఎనస్థీషియా పీజి విద్యార్థిని డాక్టర్ దీపిక బుధవారం రాత్రి దాటిన తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటి వరకు బాగానే ఉన్న దీపికి ఉన్నట్టుండి సడెన్‌గా కుప్పకూలిపోయిందని.. అత్యవసర చికిత్స అందించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని తోలి విద్యార్థినులు చెబుతున్నారు. సమాచారం అందుకన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దీపిక మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఆపరేషన్ థియేటర్‌లో పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్పిటల్‌లో ఆ రాత్రి ఏం జరిగింది?
Dr. Deepika Death

Updated on: Feb 06, 2026 | 10:56 AM

విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌లో ఎనస్థీషియా చదువుతున్న పీజీ విద్యార్థిని దీపిక ఉన్నట్టుండి అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికింగా తీవ్ర కలకలం రేపుతోంది. అర్థరాత్రి వరకు విధుల్లో ఉన్న దీపికి కేవలం అరగంటలోనే ప్రాణాలు కోల్పోయిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కోవూరునగర్‌కు చెందిన కోదండరామిరెడ్డి, భారతి దంపతుల చిన్న కుమార్తె దీపిక తిరుపతి వేంకటేశ్వర మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసి ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో పీజీ ఎనస్థీషియా చివరి ఏడాది చదువుతుంది. ఇంకో నాలుగు నెలల్లో పీజీ పీజీ పూర్తి చేసుకొని ఇంటికోస్తుందన్న కుమార్తె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

బుధవారం రాత్రి ఏం జరిగింది?

బుధవారం రాత్రి దీపిక మరో ఎనస్థీషియా పీజీ విద్యార్థినితో కలిసి హాస్పిటల్‌లో విధులు నిర్వహించారు. అయితే ఆరోజు రాత్రి రెండు ఆపరేషన్‌లు జరగ్గా పేషెంట్స్‌కు మందులు ఇచ్చి.. నైట్ 11 తర్వాత ఫుడ్ తెప్పించుకొని ఇద్దరూ తిన్నారు. అయితే దీపిక తనకు కాస్తా వాంతులు వచ్చేలా ఉన్నాయని చెప్పడంతో తోలి వైద్యురాలు ఆమె సూచన మేరకు తనకు ఇంజెక్షన్ ఇచ్చి వార్డుకు వెల్లింది. రాత్రి మరో ఆపరేషన్ ఉండడంతో దీపికి అక్కడే ఉండిపోయింది. రాత్రి 1గంటల వరకు ఆపరేషన్ థియేటర్ లోపలికి, బయటకు తిరుగూ ఉన్న దీపికి తర్వాత బయటకు రాలేదు. వెళ్లి చూడగా అక్కడే అపస్మారక స్థిలిలో పడిపోయింది. గమనించిన తోలి వైద్యులు సీపీఆర్ చేసి, చికిత్స అందించినా ఎలాంటి లాభం లేకపోయింది.

అయితే ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకొని దీపిక మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆమె చేతిపై నాలుగు ఇంజెక్షన్ ఆనవాళ్లు కనిపించాయి. అవేంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేమాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పెళ్లి కూతురులా చూడాలనుకున్న కుమార్తెను ఈ స్థితిలో చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తేనే దీపిక మృతికి అసలైన కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.