Vijayawada: బెజవాడ దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన పాలకమండలి

|

May 29, 2023 | 8:10 PM

దుర్గాఘాట్ లో స్నానాలు ఆచరించే‌ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తీర్మానించారు. రూ.500 టిక్కెట్ తగ్గింపుపై ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మరిన్ని నిర్ణయాలు తెలుసుకుందాం పదండి.

Vijayawada: బెజవాడ దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన పాలకమండలి
Kanaka Durga Temple
Follow us on

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం జరిగింది.  చైర్మన్ కర్నాటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పాలకమండలి సభ్యులు, ఈవో బ్రమరాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ది పనులు, త్వరలో చేపట్టే కార్యక్రమాల అమలు, భక్తులకు మెరుగైన వసతుల కల్పనతో పాటు అజెండాలోని పలు అంశాలపై చర్చించారు. పాలకమండలిలో పలు  కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మే 30 నుంచి  ప్రతిరోజు 3వేల నుంచి 4వేల మందికి అన్నదానం చేయాలని.. శని, ఆదివారాల్లో 5వేల మందికి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి గుడికి వచ్చే భక్తులకు కూడా ఇకపై అన్న ప్రసాదం పెట్టాలని పాలక మండలి నిర్ణయించింది. దుర్గ ఘాట్ ఆధునీకరణ, ప్రతి పౌర్ణమికి 9 కిలోమీటర్ల గిరిప్రదక్షణకు బస్ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించారు. ప్రొవిజన్స్ స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొండ దిగువున ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

బెజవాడలో శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది. భక్తుల కోరికలు తీర్చే  కొంగు బంగారంగా విరాజిల్లుతుంది.  ఈ దుర్గ గుడి క్షేత్ర పాలకుడు.. ఆంజనేయస్వామి. వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకునే సౌలభ్యం ఉంటుంది.  మధ్యాహ్నం భోజన విరామ సమయంలో..  కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..