Vijyawada: భలే.. భలే.. నగరంలో హెలికాప్టర్ జాలీ రైడ్ మరో మూడు రోజులు పొడిగింపు..

విజయవాడ దసరా ఉత్సవాల్లో హెలి జాయ్ రైడ్స్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నిర్వహించిన ఈ రైడ్స్‌ను నగర ప్రజలు, భక్తులు, పర్యాటకులు ఆస్వాదించారు. విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మరో మూడు రోజులు పొడిగించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Vijyawada: భలే.. భలే.. నగరంలో హెలికాప్టర్ జాలీ రైడ్ మరో మూడు రోజులు పొడిగింపు..
Heli Joy Ride

Edited By:

Updated on: Oct 03, 2025 | 6:53 PM

విజయవాడ దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన హెలి జాయ్ రైడ్ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఆకర్షణను నగర ప్రజలు, భక్తులు, పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా ఆస్వాదిస్తున్నారు. ప్రజల ఈ విశేష ఆదరణ దృష్ట్యా, కార్యక్రమాన్ని మరో మూడు రోజులు పాటు కొనసాగించాలని నిర్ణయించినట్లు విహంగ్ అడ్వెంచర్స్ ఏవియేషన్ నిర్వాహకుడు సూర్య ప్రకటించారు. కలెక్టర్ నుండి అవసరమైన అనుమతులు కూడా లభించాయని ఆయన తెలిపారు. అంటే ఆదివారం సాయంత్రం వరకు ఈ జాలీ రైడ్‌కు వెళ్లవచ్చు.

ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో సూర్య మాట్లాడుతూ, “విజయవాడ దసరా ఉత్సవాల సందర్భంలో ప్రజలకు ఒక కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ హెలి జాయ్ రైడ్స్ ప్రారంభించాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో హెలి టూరిజంను ప్రోత్సహించాలన్న ధృఢ సంకల్పంతో ఉన్నారు. దాని భాగంగానే ఈ ఉత్సవాల్లో హెలికాప్టర్ రైడ్స్‌ను ప్రవేశపెట్టాం. ప్రజల నుంచి లభించిన అద్భుతమైన స్పందన మాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అందుకే ఈ సేవలను మూడు రోజులు పొడిగిస్తున్నాం” అని వివరించారు.

ఈ హెలి రైడ్స్ ద్వారా ప్రజలు విజయవాడ నగరాన్ని, కృష్ణా నది పరిసరాలను, కనకదుర్గమ్మ ఆలయం పరిసరాలను ఆకాశం నుండి వీక్షించే ప్రత్యేక అవకాశం పొందుతున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, యువత ఈ రైడ్‌ను మరింత ఆసక్తిగా ఆస్వాదిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. దసరా ఉత్సవాల్లో భక్తి, ఆనందం మాత్రమే కాకుండా పర్యాటకానికి కొత్త వన్నెలు అద్దడానికి ప్రభుత్వం, నిర్వాహకులు తీసుకున్న ఈ ప్రయత్నం విజయవంతమవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.