Vijayawada: విజయవాడ రైల్వే డివిజన్ కు అరుదైన ఘనత.. ఆ విభాగాల్లో అవార్డులు కైవసం

|

Apr 21, 2022 | 9:37 AM

విజయవాడ(Vijayawada) రైల్వే డివిజన్ అరుదైన ఘనత దక్కించుకుంది. దక్షిణ మధ్య రైల్వే వారోత్సవాల్లో భాగంగా డివిజన్‌ పరిధిలోని 15 విభాగాల్లో ఏడింటికి ఉత్తమ పనితీరు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను....

Vijayawada: విజయవాడ రైల్వే డివిజన్ కు అరుదైన ఘనత.. ఆ విభాగాల్లో అవార్డులు కైవసం
Vijayawada
Follow us on

విజయవాడ(Vijayawada) రైల్వే డివిజన్ అరుదైన ఘనత దక్కించుకుంది. దక్షిణ మధ్య రైల్వే వారోత్సవాల్లో భాగంగా డివిజన్‌ పరిధిలోని 15 విభాగాల్లో ఏడింటికి ఉత్తమ పనితీరు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను సికింద్రాబాద్‌(Secunderabad) రైల్‌ నిలయంలో డీఆర్‌ఎం శివేంద్రమోహన్‌ అందించారు. సోలార్‌ విద్యుత్ వినియోగం, పర్యావరణహిత భవనంగా రైల్వే ఆసుపత్రికి ప్లాటినం రేటింగ్‌ వచ్చినందున బెస్ట్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ, కన్జర్వేషన్‌ షీల్డ్‌ వచ్చింది. విజయవాడ, హైదరాబాద్‌ డివిజన్లకు కలిపి బెస్ట్‌ మెయింటెయిన్డ్‌ ఎంఆర్‌వీ షీల్డ్‌ వచ్చింది. డెమూ, మెమూ, ఈఎంయూ షెడ్లలో ఉత్తమ సేవలు అందించినందుకు బెస్ట్‌ మెయింటెయిన్డ్‌ షీల్డ్‌ విజయవాడ డివిజన్‌కు వచ్చింది. ఎన్విరాన్‌మెంటల్‌, హౌస్‌కీపింగ్‌ షీల్డ్‌ కూడా విజయవాడ డివిజన్‌కు వచ్చింది. రైల్వేస్టేషన్లలో పరిశుభ్రత, పర్యావరణహిత వంటి అంశాలలో ఈ అవార్డు వరించింది. కీలకమైన విజయవాడ రైల్వేస్టేషన్‌ సహా మిగతా స్టేషన్లలో పటిష్ఠ భద్రతా చర్యల నేపథ్యంలో అవార్డు వచ్చింది. సిగ్నల్‌ అండ్‌ టెలికాం షీల్డ్‌ కూడా సికింద్రాబాద్‌తో కలిపి విజయవాడ డివిజన్‌కు వచ్చింది. రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణ పనులకు సంబంధించిన ఎలక్ట్రికల్‌ షీల్డ్‌ కూడా విజయవాడ డివిజన్‌కు వచ్చింది.

గతంలో విజయవాడ మీదుగా దక్షిణ మధ్య రైల్వే.. అతి పొడవైన బ్రహ్మాస్త్ర గూడ్స్​రైలును నడుపి రికార్డు సాధించింది. దేశంలోనే రెండో అతిపొడవైన ఈ గూడ్స్​రైలును విజయవాడ రైల్వే డివిజన్ నడుపుతోంది. మొత్తం 234 బాక్సులతో విజయవాడ నుంచి తాల్చేర్​కు గూడ్సు రైలు వెళ్తోంది. దక్షిణ మధ్య రైల్వే శాఖ బొగ్గు కొరత కారణంగా ఈ గూడ్సు నడుపుతోంది. ప్రత్యేకంగా బొగ్గు సరఫరా కోసమే ఈ గూడ్స్​ రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Also Read

Tomato Price: మళ్ళీ టమాటా ధర పైపైకి.. అన్నదాత హర్షం.. మరింత పెరిగే అవకాశముందంటూ..

Bank of India Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 696 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..

TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షల దరఖాస్తు ఫీజు చెల్లింపులకు నేడే ఆఖరు! వెంటనే..