Tomato Price Hike: ఆల్ టైం హైకి టమాటా ధర.. చికెన్‌తో పోటీపడుతున్న కూరగాయలు.. సామాన్యుడి కంట కన్నీరు

|

Nov 22, 2021 | 5:31 PM

Tomato Price Hike: ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు, వరదలకు కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. వర్షాలు, వరదలతో పంటలు నీట..

Tomato Price Hike: ఆల్ టైం హైకి టమాటా ధర.. చికెన్‌తో పోటీపడుతున్న కూరగాయలు.. సామాన్యుడి కంట కన్నీరు
Tomato Price
Follow us on

Tomato Price Hike: ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు, వరదలకు కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. వర్షాలు, వరదలతో పంటలు నీట మునగడంతో పాటు.. దిగుబడి గణనీయంగా పడిపోవడంతో మార్కెట్ లో కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా టమాటాకు భారీ డిమాండ్ ఏర్పడింది. హోల్ సేల్ గానే టమాటా ధర భారీగా పలుకుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఎపిఎంసి మార్కెట్‌లో టమాటా ధర రికార్డ్ స్థాయిలో పలికింది.  15 కేజీల టమోటా బాక్సు వెయ్యి రూపాయలుగా ఉంది. దీంతో టమాటా పండించిన రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంటే.. సామాన్యుల కళ్ళల్లో కన్నీరు వస్తుంది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న విపరీతమైన వర్షాలు, వరదలు కూడా టమాట ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అంతేకాదు ఆదివారం టమాటా ధర ఆల్ టైం కు చేరుకుంది. ఆదివారం నందికొట్కూరు మార్కెట్‌లో కిలో టమాట రూ.120కి విక్రయించారు. దీనికి కారణం గత కొన్ని రోజుల క్రితం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల ప్రభావం టమాటా సాగుపై పడింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, అనంతపురం జిల్లాల్లో టమోటా పంట పూర్తిగా దెబ్బతింది. అయితే కర్నూలు జిలాల్లో వర్ష ప్రభావం తక్కువగాఉంది. దీంతో ఇక్కడ సాగు చేసిన టమాటా మార్కెట్ కు చేరుకుంటుంది. గిరాకీ పెరిగింది.

మరోవైఫు ఆంధ్రప్రదేశ్‌లో వరదల ప్రభావం తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో టమోటా ధరపైకూడా పడింది. మదనపల్లి నుండి కరీంనగర్ కు కూరగాయల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అకస్మాత్తుగా టమాటా ధర పెరిగింది. ప్రస్తుతం కరీంనగర్ సహా తెలంగాణలోని పలు జిల్లాలో కిలో టమాటా ధర రూ. 100 లకంటే ఎక్కువగా ఉంది.

దీంతో గత కొన్ని రోజుల క్రితం వరకూ కిలో టమాటా ధర రూ. 80 ఉండగా .. ఆదివారం మాత్రం రూ. 120 కి చేరుకుంది. కర్నూలు జిల్లాలో టమాటా సాగు చేసిన రైతుల సంతోష పడుతున్నారు. సామాన్యులకు ఏమి కొనాలి ఏమి తినాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో ఒక్క టమాటా ధర మాత్రమే కాదు..చికెన్ తో పోటీపడుతూ ఉల్లిపాయ, సొరకాయ, బెండకాయ అన్ని కూరగాయలు మునిపటి కంటే రెట్టింపుకు చేరుకున్నాయి. దీంతో ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read:   ఫుడ్ లవర్స్ కోసం.. ఫాంటా తో మ్యాగీ తయారీ .. వీడియో వైరల్

Dog and Child: టీచింగ్ కూడా ఓ కళ .. పసివాడికి పాకడం నేర్పిస్తున్న కుక్క..నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్