
హైవేపై ఓ కూల్‌డ్రింక్‌లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా పడగా పోలీసులు వచ్చేలోపే సగం కూల్‌డ్రింక్ కేసులను స్థానికులు, వాహనదారులు ఎత్తుకెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కూల్‌డ్రింక్స్ లోడ్‌లో ఓ వాహనం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా టైర్ పేలడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదంలో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. రోడ్డుపై వ్యాన్ బోల్తా పడడంతో ఆ వాహనంలో ఉన్న కూల్‌డ్రింక్ కేసులు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. దాన్ని గమనించిన స్థానిక వాహనదారులు.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను హాస్పిటల్‌కు తరలించాల్సింది పోయి..రోడ్డుపై పడిఉన్న కూల్‌డ్రింక్స్‌ను ఎత్తుకెళ్లే పనిలో పడ్డారు. ఇదే అదునుగా చూసుకొని అందినకాడికి కూల్‌డ్రింక్ కేస్‌లను తీసుకొని వెళ్లిపోయారు.
ఇక అక్కడే ఉన్న మరికొందరు స్థానికులు ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వాహనాన్ని తొలగించారు. ఆ తర్వాత అక్కడ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
A cool drink van overturned on the Vijayawada-Machilipatnam highway after its tire burst due to excessive speed, resulting in injuries to three people inside. Passersby stopped to help, while locals took the opportunity to carry away cases of cool drinks. pic.twitter.com/19M7O3H7JE
— RSB NEWS 9 (@ShabazBaba) May 13, 2025
అయితే వాహనం బోల్తా పడడంతో రోడ్డుపై పడి ఉన్న కూల్‌డ్రింక్ కేసులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలను వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..