Tirumala Information: తిరుమల శ్రీవారి ఆలయంలో పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగిశాయి. ఆదివారం రాత్రి ఏకాంత సేవ అనంతరం అర్చకులు వైకుంఠ ద్వారాలను శాస్త్రోక్తంగా మూసివేశారు. వైకుంఠ ఏకాదశి మొదలు భక్తులకు జనవరి 3వ తేదీ రాత్రి వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించిన విషయం తెలిసిందే. దాదాపు 4.25 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కాగా, గడిచిన తొమ్మిది రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 26.27 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇక వైకుంఠ ద్వార దర్శనం ముగియడంతో తిరుపతిలో ఉచిత దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.
ఇదిలాఉండగా, సోమవారం నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, తెలంగాణ ఎమ్మెల్యే వికేక్, ఎమ్మెల్సీ శంకర్ రాజు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఏపీ సమాచారశాఖ కమిషనర్ శ్రీనివాసరావు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం సందర్భంగా వారికి వేద పండితులు ఆశీర్వచనాలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Also read:
పాకిస్తానీ గర్ల్ మలాలా యూసుఫ్ జాయ్ కి ‘స్కాలర్ షిప్ యాక్ట్’ బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం