ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.70 వేల కోట్లు విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏపీ రైల్వే ప్రాజెక్టుల విషయంలో వైసీపీ (YCP) ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పారు. వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టులు కావాలని కేంద్రాన్ని కోరుతున్న ఎంపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సూచించారు. కేంద్రానికి సహకరించేలా చేస్తే ప్రస్తుతం కొనసాగుతున్న పనులయినా త్వరగా పూర్తవుతాయన్నారు. ఆ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాగా రూ.1,798 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు ప్రకటించడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పనులు మూడేళ్లుగా ఆగిపోయాయి. ప్రభుత్వం తమ వాటా చెల్లించకపోవడంతో ముందుకు పడటం లేదన్నది కేంద్ర మంత్రి మాట.
వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానంగా ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో ఏపీలో రూ.70,000 కోట్ల రైలు ప్రాజెక్టులు ఆగిపోయాయని తెలిపింది. దీంతో జగన్ ప్రభుత్వం అసమర్థత మరొకసారి బయట పడింది! pic.twitter.com/ZtZGbCgwjX
ఇవి కూడా చదవండి— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) July 27, 2022
ఆంధ్రప్రదేశ్ లో చాలావరకు రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కేటాయించకపోవడంతో పనుల్లో పురోగతి లేదు. వాటిని కేంద్రం సాయంతోనే పూర్తి చేయాలనుకుంటున్న వైసీపీకి ప్రస్తుతం కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం పిడుగుపాటులా మారింది. రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందేనని రైల్వేమంత్రి కుండబద్ధలు కొట్టారు.