వచ్చే నెలలో పోలవరం సందర్శనకు కేంద్ర మంత్రి రాక..!

| Edited By: Pardhasaradhi Peri

Aug 26, 2019 | 6:07 PM

పోలవరం పనులను పరిశీలించేందుకు రావాల్సిందిగా కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర సింగ్‌ను సీఎం జగన్ ఆహ్వానించారని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ సెప్టెంబర్‌లొ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని అందుకే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లినట్టు చెప్పారు. ఇకపై ప్రాజెక్టు పనులను రీ టెండరింగ్ ద్వారానే నిర్వహిస్తామన్నారు. వీటిని త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. ప్రాజెక్టును అనుకున్న సమయానికి రికార్డ్ టైమ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి […]

వచ్చే నెలలో పోలవరం సందర్శనకు కేంద్ర మంత్రి రాక..!
Follow us on

పోలవరం పనులను పరిశీలించేందుకు రావాల్సిందిగా కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర సింగ్‌ను సీఎం జగన్ ఆహ్వానించారని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ సెప్టెంబర్‌లొ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని అందుకే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లినట్టు చెప్పారు. ఇకపై ప్రాజెక్టు పనులను రీ టెండరింగ్ ద్వారానే నిర్వహిస్తామన్నారు. వీటిని త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. ప్రాజెక్టును అనుకున్న సమయానికి రికార్డ్ టైమ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని తెలిపారు. ఇక పోలవరం నిర్మాణ పనులను కేంద్రానికి ఇచ్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.

మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీరు అందించాలనే సంకల్పాన్ని కేంద్ర మంత్రి వివరించారని, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించే ప్రాజెక్టుకు సెప్టెంబర్‌లో టెండర్లు పిలవబోతున్నట్టు మంత్రి  పెద్దిరెడ్డి చెప్పారు.