AP CM Jagan: సీఎం జగన్‌తో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు భేటీ.. మత్స్యకారుల కోసం అందుబాటులోకి కొత్త యాప్

సీఎం జగన్‌తో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయని చెప్పారు.

AP CM Jagan: సీఎం జగన్‌తో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు భేటీ.. మత్స్యకారుల కోసం అందుబాటులోకి కొత్త యాప్
Ap Cm Jagan

Updated on: Jul 08, 2023 | 7:22 AM

ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు భేటీ అయ్యారు. కేంద్రమంత్రిని సీఎం జగన్‌ శాలువాతో ఘనంగా సత్కరించి.. మెమోంటో అందజేశారు. తర్వాత రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఇద్దరూ చర్చించారు. మర్యాదపూర్వక భేటీగా సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, మంత్రి జోగి రమేష్, మత్స్యకార సంఘ నాయకులు మొదలైనవారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో ఏ ప్రదేశంలో అధికంగా మత్స్య సంపద ఉంటుంది.. ఏ ప్రాంతంలో వేటకు వెళ్లడం వలన మత్స్యకారులకు అధిక చేపలు లభ్యమవుతాయ అనే విషయంపై అవగాహన కల్పిచారు. అంతేకాదు వేటకు వెళ్లే సమయంలో సముద్రంలో అలల ఉధృతి గురించి అంచనా వేయాలని.. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే విధంగా భారత ప్రభుత్వం యాప్​లను తయారుచేసి మత్స్యకారులకు అందుబాటులోకి తెచ్చామని.. కొత్త టెక్నాలజీతో బోట్లను తీసుకురావడం వలన మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు కేంద్రమంత్రి రిజిజు.

మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు కేంద్ర మంత్రి రిజిజు. ఇటీవల సీఎం జగన్  ఢిల్లీకి వెళ్లి.. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు తదితర అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలను, రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై జగన్ చర్చించారు. ఈ నేపథ్యంలో కిరణ్ రిజిజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..