Polavaram: పోలవరం ప్రాజెక్ట్‌ అనుకున్న సమయానికి పూర్తికాకపోవచ్చు.. రాజ్యసభలో తేల్చేసిన కేంద్రం

|

Dec 12, 2022 | 5:50 PM

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరింత జాప్యం జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టకు సంబంధించి వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

Polavaram: పోలవరం ప్రాజెక్ట్‌ అనుకున్న సమయానికి పూర్తికాకపోవచ్చు.. రాజ్యసభలో తేల్చేసిన కేంద్రం
Polavaram Project
Follow us on

పోలవరం పనుల్లో జాప్యం జరగొచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న గడువులోగా పోలవడం పూర్తికవాడం కష్టమేనని తేల్చి చెప్పింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టకు సంబంధించి వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అంచనా వేసిన టైమ్‌లైన్‌ల ప్రకారం.. పోలవరం ప్రాజెక్ట్‌ను 2024 మార్చి నాటికి, ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను 2024 జూన్ నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడిందని తెలిపారు. 2020, 2022లో వచ్చిన భారీ వరదల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం ఉంటుందనే అంచనా వేస్తున్నామన్నారు. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 15 వేల 970 కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో రూ. 13 వేల 226 కోట్లు కేంద్రం తిరిగి చెల్లించిందని పేర్కొన్నారు. మరో రూ.483 కోట్ల ఖర్చుపై రాష్ట్రం నుంచి బిల్లులు వచ్చాయని స్పష్టం చేశారు. మార్చి 2024 నాటికి ప్రాజెక్టు, జూన్ 2024 నాటికి పంపిణీ నెట్‌వర్క్ పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని తన సమాధానంలో చెప్పారు కేంద్రమంత్రి.

ప్రాజెక్ట్ పర్యవేక్షణ, సకాలంలో అమలు కోసం భారత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ప్రాజెక్ట్ సకాలంలో అమలును నిర్ధారించడానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబడిన ఏజెన్సీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం