
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో వేటకు వెళ్లిన ఇద్దరు వేటగాళ్లు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. బండ్లదొడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌కు గురైన ఇద్దరు మృతి చెందగా.. ప్రమాదానికి గురైనవారు గోవింద్ స్వామి, కుట్టిగా గుర్తించారు పోలీసులు. అడవి పందుల కోసం విద్యుత్తు తీగలను గుర్తు తెలియని వ్యక్తులు అమర్చారు. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు వేటగాళ్ల పాలిట యమపాశాలుగా మారాయి.
అడవి పందులను వేటాడేందుకు ఉచ్చుగా అమర్చిన విద్యుత్ తీగలు గోవింద స్వామి, కుట్టి అనే ఇద్దరికి తాకాయి. అడవిలో వేటాడేందుకు వెళ్లి విద్యుత్ తీగ తగలడంతో వాళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరితో పాటు అడవి పంది కూడా మృతి చెందగా.. ఆవులు మేపేందుకు వెళ్లిన వాళ్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.