Nellore Road Accident: నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీని పాల వ్యాన్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. నలుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే అటు మధ్యప్రదేశ్‌లో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాలియర్ సమీపంలో బస్సును ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!
జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!