Andhra Pradesh: తగ్గేదేలే! నడ్డిరోడ్డుపై పొట్టు పొట్టుగా తన్నుకున్న అమ్మాయిలు.. పిడిగుద్దులతో..

విజయవాడలో ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై జుట్లుపట్టుకుని కొట్టుకున్నారు. నడిరోడ్డుపై నలుగురు చూస్తుండగానే జుట్టు పట్టుకుని సై అంటే సై..

Andhra Pradesh: తగ్గేదేలే! నడ్డిరోడ్డుపై పొట్టు పొట్టుగా తన్నుకున్న అమ్మాయిలు.. పిడిగుద్దులతో..
Girls

Updated on: Apr 23, 2022 | 6:17 PM

విజయవాడలో ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై జుట్లుపట్టుకుని కొట్టుకున్నారు. నడిరోడ్డుపై నలుగురు చూస్తుండగానే జుట్టు పట్టుకుని సై అంటే సై అంటూ బాహాబాహీకి దిగారు. విజయవాడ వన్ టైన్ లోని కేబీఎన్ కాలేజీ గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గొడవకు కారణాలు తెలియదుగానీ ఆ ఇద్దరు యువతులు మాత్రం పిడిగుద్దులతో ముష్టి యుద్ధం చేసుకున్నారు. పక్కనున్న స్నేహితులు, ఇతర విద్యార్థినులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా, తగ్గేదేలా అన్నట్లు కొట్లాడుకున్నారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడున్న వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. వీరు నడిరోడ్డుపై ఇలా ఎందుకు కొట్టుకున్నారన్న దానిపై కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా, విశాఖపట్నంలో గతేడాది ఇలాంటి తరహా ఘటన ఒకటి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని కొట్లాడుకుంటే.. అది చూసి జనాలు ఒకింత షాక్‌కు గురయ్యారు. అయితే ఇంతకీ దానికి అసలు కారణం ఏంటని ఎంక్వయిరీ చేస్తే.. ఒక అబ్బాయి కోసం వీరిద్దరూ ఇలా తన్నుకున్నారని తెలిసింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని యువతులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us