TTD: తిరుమలలో భక్తుల తోపులాట.. టీటీడీ అధికారుల కీలక నిర్ణయం

|

Apr 13, 2022 | 6:34 AM

తిరుమలలో నెలకొన్న రద్దీ నేపథ్యంలో టీటీడీ(TTD) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న జరిగిన తోపులాటను దృష్టిలో పెట్టుకుని టికెట్లు లేకుండా నేరుగా తిరుమలకు(Tirumala) వచ్చిన భక్తులకు నేటి నుంచి...

TTD: తిరుమలలో భక్తుల తోపులాట.. టీటీడీ అధికారుల కీలక నిర్ణయం
Tirumala Rush
Follow us on

తిరుమలలో నెలకొన్న రద్దీ నేపథ్యంలో టీటీడీ(TTD) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న జరిగిన తోపులాటను దృష్టిలో పెట్టుకుని టికెట్లు లేకుండా నేరుగా తిరుమలకు(Tirumala) వచ్చిన భక్తులకు నేటి నుంచి దర్శనానికి అనుమతించేందుకు నిర్ణయించారు. దీంతో టికెట్లు లేకుండా వస్తున్న భక్తులతో క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వైకుంఠం-2 వెలుపల క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ(Huge Rush in Tirumala) వల్ల సర్వదర్శనం స్లాట్‌ విధానం రద్దు చేసినట్టు వెల్లడించారు. చెప్పారు. వైకుంఠంలో వేచి ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. భారీగా నెలకొన్న రద్దీ వల్ల స్వామి వారి దర్శనానికి 20 నుంచి 30 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు మంగళవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొ్న్నారు. గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్ల జారీ కేంద్రం తొక్కిసలాటలో అయిదుగురు గాయపడ్డారు. పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు.

సాధారణ రోజుల కంటే వేసవిలో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలకొద్దీ భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నా.. ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించారు. చూస్తుండగానే భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. వారు వేచి ఉండేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ఎంతసేపటికీ క్యూలైన్లు తగ్గకపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వచ్చేసరికే పరిస్థితి అదుపు తప్పింది.

Also Read

LIC IPO: ఏప్రిల్‌ చివరి వారంలో ఎల్‌ఐసీ ఐపీఓ..! ప్రభుత్వ విక్రయ వాటా పెరిగే అవకాశం..

MI vs PBKS IPL 2022 Match Prediction: మొదటి గెలుపు కోసం ముంబై తహతహ.. మూడో విజయం కోసం పంజాబ్‌.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండచ్చంటే!

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. ‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ అప్డేట్