తిరుమల వెంకన్నపై రాజకీయాలు వద్దు.. ఆ వార్తలు బాధాకరం

| Edited By:

May 25, 2020 | 5:44 PM

టీటీడీ ఆస్తుల వేలంపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల వెంకన్నపై రాజకీయాలు వద్దు. రెండు రోజులుగా వస్తున్న వార్తలు బాధాకరం. రాజకీయ వ్యతిరేకతతోనే మాపై నిందలు...

తిరుమల వెంకన్నపై రాజకీయాలు వద్దు.. ఆ వార్తలు బాధాకరం
Follow us on

టీటీడీ ఆస్తుల వేలంపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల వెంకన్నపై రాజకీయాలు వద్దు. రెండు రోజులుగా వస్తున్న వార్తలు బాధాకరం. రాజకీయ వ్యతిరేకతతోనే మాపై నిందలు వేస్తున్నారు. మేం కేవలం దేవుడి సేవకులం మాత్రమే. సదావర్తి, దుర్గమ్మ, సింహాచలం భూములు ప్రతిపక్షంలో ఉండి కాపాడాం. కాగా గత ప్రభుత్వంలో గరుడవాహన ఫ్లైఓవర్‌‌కు టీటీడీ నిధులు కేటాయించారు. 1974 నుంచి 2014 వరకూ వందకుపైగా టీటీడీ ఆస్తులను అమ్మారు. మరో 50 ఆస్తులను వేలం వెయ్యాలని 2016లో తీర్మానం కూడా చేశారు. ఆ రోజు వీరందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు.

ప్రస్తుతం ఆస్తుల వేలంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత పాలకమండలి చేసిన తీర్మానంపై మాత్రమే సమీక్ష చేశామన్నారు వైవీ సుబ్బారెడ్డి. కాగా మారు మూల గ్రామాల్లో దాతలు సెంటు, రెండు సెంట్ల భూములిచ్చారు. ఆ ఆస్తులను ఏం చేయాలన్నదే మే ఆలోచించాం. రోడ్ మ్యాప్ ఇవ్వాలనే చెప్పాం. వెంకన్న ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదనే మా ఉద్ధేశం. పెద్దలు, నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.

మరిన్ని విషయాలను ఈ కింది లైవ్‌లో చూడండి:

Read More: 

వరంగల్ మర్డర్ మిస్టరీ: 9 కాదు 10 హత్యలు.. బతికుండగానే.. చంపేశాడు

‘మన పాలన – మీ సూచన’లో సీఎం జగన్ కీలక పాయింట్స్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..