అనకాపల్లి జిల్లా రావికమతం రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కొండ శిఖర గ్రామం నేరడిబంద ఆదివాసీ గిరిజన గ్రామం.. 15 కుటుంబాలు 80 మంది జనాభా జీవనం… వారికి కనీస సౌకర్యాలు ఆమడ దూరం.. గ్రామానికిరోడ్డు సౌకర్యం లేదు… PVTG కొందు గిరిజనులకు ధ్రువపత్రాలు లేవు.. ఏదైనా కష్టం వస్తే డోలీమూతలే వారికి దిక్కు.. కాలినడక, బడికి వెళ్లాలంటే గుర్రాల పైన వాళ్ళ సవారి. దీంతో ఇక చేసేదిలేక ఆందోళన బాట పట్టారు. గుర్రాలతో ర్యాలీ నిర్వహించారు.
వీడియో ఇక్కడ చూడండి..
జిల్లా కలెక్టర్ ప్రత్యేకించి ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేసి రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ పి వి టి జి గిరిజన గ్రామాలు సందర్శించి తమ సమస్యలు తెలుసుకోవాలని విన్నవించారు. ఈ నిరసనలో గిరిజన సంఘం నాయకులు కిల్లో సూరిబాబు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి