Andhra: ఉరి తప్పించినా – చావు మాత్రం తప్పలేదు – ఏం జరిగిందంటే..?

వైద్య ఖర్చులు, అప్పుల భారం కారణంగా ఆత్మహత్యకు యత్నించిన ధర్మవరం యువకుడు జయకుమార్ (25) తల్లి, చెల్లి కాపాడే ప్రయత్నం చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. ఫ్యానుకు వేలాడుతున్న సమయంలో పట్టుతప్పి కిందపడి తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు.

Andhra: ఉరి తప్పించినా - చావు మాత్రం తప్పలేదు - ఏం జరిగిందంటే..?
Jai Kumar

Edited By:

Updated on: Jun 20, 2025 | 6:27 PM

విధి ఎంత విచిత్రమైనది… ఎవరికి చావు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు… ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్న యువకుడిని తల్లి, చెల్లి కాపాడుదాం అని ప్రయత్నం చేస్తుంటే… ఆ యువకుడికి చావు మరోలా వచ్చింది… కాలం కలిసి రాకపోవడం అంటే ఇదేనేమో… ధర్మవరం పట్టణానికి చెందిన జయ కుమార్ (25) చేనేత కార్మికుడు… అయితే ఇటీవల జయకుమార్‌కు రోడ్డు ప్రమాదంలో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి… దీంతో వైద్య ఖర్చుల కోసం, కుటుంబ పోషణ కోసం జయ కుమార్ అప్పులు చేశాడు. ఆరోగ్యం సహకరించకపోవడం, అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో విరక్తి చెందిన జయకుమార్ ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. ఫ్యానుకు ఉరేసుకొని జయ కుమార్ ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు.

జై కుమార్ ఆత్మహత్యా ప్రయత్నాన్ని గమనించిన తల్లి వనిత, సోదరి కోమల… అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. ఉరివే సుకొని వేలాడుతున్న జయకుమార్ కాళ్లను వేలాడకుండా ఒకరు పట్టుకుంటే… మరొకరు మెడకు ఉన్న ఉరి ముడి విప్పే ప్రయత్నం చేస్తుండగా… జయ కుమార్ పట్టు తప్పి కిందపడ్డాడు… దీంతో కింద మగ్గానికి ఉన్న ఇనుప చువ్వ తలకు బలంగా తగలడంతో… తీవ్ర రక్తస్రావంతో జయకుమార్ మృతి చెందాడు.  కిందపడి జయ కుమార్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉరితాడు తప్పినా… జయ కుమార్ చావు మాత్రం తప్పలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..