Andhra Pradesh: అకాల మరణం.. అయినా చిరంజీవిగానే..ఆ పేరేంట్స్ కు సలాం..

పేరెంట్స్ గొప్ప మనస్సు చాటుకున్నారు. కుమారుడి గుండె, కిడ్నీ, కాలేయం దానం చేసేందుకు ముందుకొచ్చారు. యాక్సిడెంట్‌లో కుమారుడి బ్రెయిన్ డెడ్ అవ్వగా.. అతడి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో తల్లిదండ్రులను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra Pradesh: అకాల మరణం.. అయినా చిరంజీవిగానే..ఆ పేరేంట్స్ కు సలాం..
Chinna Rao

Edited By:

Updated on: Jul 15, 2026 | 12:54 PM

వాళ్ళది నిరుపేద కుటుంబం.. కొడుకులే వారికి జీవనధారం.. చేతికి అంది వచ్చిన కొడుకులను చూస్తూ మురిసిపోతున్నారు. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్టే అని భావిస్తున్న వేళ.. అనుకోని ఆపద నా కుటుంబానికి విషాదంలోకి నెట్టేసింది. రోడ్డు ప్రమాదంలో ఓ కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. వైద్యానికి రెస్పాండ్ కాకపోవడంతో.. బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. తీవ్ర విషయంలోకి వెళ్లిపోయారు పేరెంట్స్. వైద్యాధికారులు కౌన్సిలింగ్ చేయడంతో.. ఆ తల్లిదండ్రులు గొప్ప మనసు చాటుకున్నారు. అంతటి విషాదంలోనూ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు.

అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో ఆ తల్లిదండ్రులు ఆదర్శంగా నిలిచారు. అచ్చిం నాయుడు, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు మగపిల్లలు. ఒకరు లోకేష్, మరొకడు చిన్న రావు. ఇద్దరూ ఐటీఐ చేశారు.. ఎలక్ట్రీషియన్ శిక్షణ పొందారు. ఎలక్ట్రిషన్ పనులు చేసుకుంటూ ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉన్నారు. ఆ పేద పేరెంట్స్ ఆ కొడుకులను చూసి మురిసిపోయేవారు. ఇంతలో విధి ఆ పేద కుటుంబంపై చిన్న చూపు చూసింది. ఈనెల 11న విధి నిర్వహణలో భాగంగా విశాఖ వెళ్లిన చిన్నారావు తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

పరవాడ హైవేపై మూడు కలవర్టుల జంక్షన్ వద్ద కుక్కను తప్పించబోయి బైక్‌తో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ సమయంలో.. తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేసిన వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబం తీరని విషాదంలోకి వెళ్లిపోయింది. వైద్యాధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో.. తన కొడుకు మరికొందరికి ప్రాణదాతగా నిలవాలని భావించారు ఆ పేరెంట్స్. గుండెలో సముద్రమంత శోకం ఉన్నప్పటికీ.. గొప్ప మనసు చాటే ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమారుడి గుండె, కిడ్నీ, కాలేయం దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆ పేరెంట్స్ కు అందరూ సలాం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us