Andhra Pradesh: అసలు మీరు ప్రభుత్వ ఉద్యోగులేనా..? మీటింగ్‌లో పొట్టుపొట్టున కొట్టుకున్న అధికారులు.. వీడియో

మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో అధికార, విపక్షపార్టీల మధ్య గొడవలు చూశాం. కానీ...పిఠాపురంలో ఇద్దరు ఆఫీసర్లే బాహాబాహికి దిగారు. వ్యక్తిగత దూషణలు చేస్తూ పరస్పరం కొట్టుకున్నారు. ఎందుకు?

Andhra Pradesh: అసలు మీరు ప్రభుత్వ ఉద్యోగులేనా..? మీటింగ్‌లో పొట్టుపొట్టున కొట్టుకున్న అధికారులు.. వీడియో
Top Officers Fight in Pithapuram Municipal

Updated on: Sep 01, 2024 | 8:51 AM

కాకినాడజిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఊహించని ఘటన జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంలో ఇద్దరు అధికారులు గొడవపడ్డారు. పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవాని శంకర్‌ల మధ్య వివాదం జరిగింది. అది కాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. దీంతో ఇద్దరు కొట్టుకున్నారు. కౌన్సిల్ సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా.. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమయంలో డీఈ సమావేశాన్ని తప్పుదోవ పట్టించారని మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆరోపించారు. దాంతో వెంటనే డిఈ భవాని శంకర్‌ లేచి ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. హద్దలు దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్..బయటకు పో అంటూ గద్దించారు. డిఈ భవాని శంకర్‌ కూడా అంతే స్ట్రాంగ్‌గా స్పందించారు. సహనం కోల్పోయిన కమిషనర్.. డీఈపై చేయి చేసుకున్నారు. డిఈ భవాని శంకర్‌ కూడా కమిషనర్‌ను కొట్టారు.

వీడియో చూడండి..

అధికారులు కొట్టుకోవడం ప్రారంభించడంతో కౌన్సిలర్లు అవాక్కయ్యారు. వెంటనే కొంత మంది తోటి ఉద్యోగులతో పాటు.. కౌన్సిలర్లు వారిని విడదీసి బయటకు పంపే ప్రయత్నం చేశారు. చాలా సేపటి వరకూ వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరాటమే గొడవకు కారణమని తెలుస్తోంది. మొత్తానికి ఈ వివాదం ముదిరి ఏకంగా కౌన్సిల్‌ సమావేశంలోనే దాడులకు దిగడంతో ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..